
మరికల్, వెలుగు: బోయలను ఎస్టీలో కలిపే వరకు ఉద్యమం కొనసాగిస్తానని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బోయలను ఎస్టీలో కలపాలని ఇటీవల పార్లమెంట్‌సమావేశాల్లో ప్రసంగించిన ఎంపీ డీకే అరుణను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువా, పూలమాలతో నారాయణపేట జిల్లా, మరికల్ మండల బోయలందరూ కలిసి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎస్టీలో కలపాలని ఏండ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్న ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎస్టీలో కలిస్తే బోయలు చాలా మంది అన్నీ రకాలుగా అభివృద్ది చెందుతారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, కన్మనూర్ గ్రామాల్లో బీజేపీ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి పలు సూచనలు చేశారు. రాష్ర్ట, జిల్లా, మండల వాల్మీకి నాయకులు కుర్మయ్య, ఎర్రనర్సిములు, సతీష్, నర్సిములు, చంద్రప్ప, నర్సిములు, ఆంజనేయులు ఉన్నారు. బీజేపీ నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, నర్సన్‌గౌడ్, తిరుపతిరెడ్డి, వేణు, భాస్కర్‌రెడ్డితో పాటు వివిధ గ్రామాల వాల్మీకులు పాల్గొన్నారు.