
మద్దూరు, వెలుగు: -ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గం పెద్ద పస్లావాద్ లో ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మద్దూరులో మాజీ ఎంపీటీసీ వెంకటయ్యతో కలిసి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.సెంట్రల్ స్కీమ్ల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా కృషి చేయాలని సూచించారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, సమస్యలను తన దృష్టికి తేవాలని భరోసా ఇచ్చారు. ఎంపీకి ఉమ్మడి మండల ప్రజలు సమస్యలపై వినతిపత్రాలను అందించారు. పార్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి, శంకర్ దామరగిద్ద, సంజీవ్గౌడ్, ఆదేశ్, రాజు గౌడ్ పాల్గొన్నారు.