
ఇంటర్ బోర్డు తీరుపై మహబూబ్ నగర్ విద్యార్థిని ఆందోళన
మహబూబ్ నగర్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కేఎమ్ గ్రేస్ ఇంటర్ ఫస్టియర్‌లో జిల్లా టాపర్.. సెకండియర్‌లోనూ రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు వచ్చాయి. మొత్తంగా వెయ్యి మార్కులకు గాను ఏకంగా 921 మార్కులుసాధించిం ది. కానీ మెమోలో చూసుకుంటే ఫెయిలైనట్టు వచ్చింది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఆమెకు ఓ సబ్జెక్టులో మాత్రం చాలా తక్కువ మార్కులు కనిపిం చాయి. పరీక్ష బాగా రాశానంటున్న ఆమె.. పేపర్ సరిగా దిద్దలేదా,మెమోలో తప్పుగా వచ్చిందా, అసలే మైందనే ఆందోళనలో మునిగిపోయింది. ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫిజిక్స్ సెకండియర్ పరీక్షలో కేవలం 14 మార్కులు వచ్చినట్లు మెమోలో ఉందని, ఇప్పటికిప్పుడు మళ్లీ పరీక్ష పెట్టినా టాప్‌మార్కులు తెచ్చుకోగలనని చెబుతోంది. ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించింది. హైదరాబాద్ వెళ్లి ఇంటర్ బోర్డు అధికారులను నిలదీస్తానని తెలిపింది.