తెలంగాణ వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నేతలు మహాధర్నా నిర్వహించారు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద మహాధర్నాలో ఉస్మానియా ఏబీవీపీ నేత శ్రీహరి పాల్గొన్నారు. విద్యారంగ పరిరక్షణ కోసం విద్యార్థి ఉద్యమం చేపట్టామని ఏబీవీపీ నేతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం.. నేడు రాష్ట్రంలో విద్యారంగాన్ని గాలికి వదిలేశారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు కనీస మాలిక వసతులు కల్పించలేననటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని అన్నారు. వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రూ. 2,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.