డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 10న..కలెక్టరేట్ ఎదుట మహాధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు : అర్హులైన పేదప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని బీజేపీ సీనియర్ లీడర్, డబుల్ బెడ్ రూమ్ పోరాట సమితి కన్వీనర్ పొల్సాని సుగుణాకర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 9 ఏండ్లైనా ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. అర్హులందరికి ఇండ్లు ఇచ్చే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈనెల10న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో 27లక్షల మందికి సొంతిండ్లు లేవని ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 24వేల ఇండ్లు మంజూరు చేయగా, 700ఇండ్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. ఈ సమావేశంలో తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, ఓదెలు, మహేందర్ రెడ్డి, మారుతి, నాగరాజు,శంకర్, జగన్, కిషోర్, సుజాతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.