బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలె..లెఫ్ట్ పార్టీల మహా ధర్నా

బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలె..లెఫ్ట్ పార్టీల  మహా ధర్నా
  • బ్లాకులను నేరుగా సింగరేణికి అప్పగించాలె
  • సింగరేణి భవన్ వద్ద లెఫ్ట్ పార్టీల  మహా ధర్నా

హైదరాబాద్:  బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.  లక్డికపూల్ లోని సింగరేణి భవన్ వద్ద  జరిగి  ధర్నాలో లెఫ్ట్ పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలన్నారు.  బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు.  సింగరేణికి నామినేషన్‌ పద్ధతిలో గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశౄరు. భూపాలపల్లిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు.  సింగరేణిని కనుమరుగు చేసేందుకు బీజేపీ  కుట్రలు చేస్తుందని ఆరోపించారు.  సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.  సింగరేణిని కాపాడుకోవడుకోవడానికి అవసరమైతే తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిస్తామని తెలిపారు.