సింగరేణి కార్మికవాడల్లో గడప గడపకు బీజేపీ

కోల్​బెల్ట్, వెలుగు : క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్​ రామాలయం సింగరేణి కార్మిక వాడల్లో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్​ సంపర్క్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.  బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ మహంకాళీ శ్రీనివాస్​ నేతృత్వంలో లీడర్లు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి తొమ్మిదేండ్లలో ప్రధాని నరేంద్రమోడీ పాలనలో సాధించిన విజయాలు, పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలోని పథకాలను అమలు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లను అందిస్తామన్నారు.  కార్యక్రమంలో విస్తరక్​ యాదగిరి, బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​మహంకాళీ శ్రీనివాస్​, లీడర్లు ఎల్పల సత్యనారాయణ, ఒరుగంటి సాయి, బంగారు ప్రసాద్​, దొంతమళ్ల శ్యాం, సుంకరి లక్ష్మణ్​, నర్సింగ్​, కునమల్ల బాబు,  బోయిన శారన్​రాజ్​, గొడిసెల తిరుపతి పాల్గొన్నారు.