అసైన్డ్ ల్యాండ్స్​కు లోన్లు ఎందుకు ఇస్తలేరు

  •     మహాజన సభలో రైతుల ఆవేదన

నవీపేట్, వెలుగు : అసైన్డ్ ల్యాండ్స్​పై లోన్లు ఎందుకు ఇవ్వడం లేదని నాగేపూర్ సొసైటీ మహాజన సభలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోస్లీ సొసైటీ వద్ద సొసైటీ చైర్మన్​ శైలేశ్​కుమార్​ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించారు. రుణమాఫీ వచ్చిన అసైన్డ్ ల్యాండ్ రైతులకు తిరిగి రుణాలు ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రస్థాయిలోనే కోపరేటివ్ బ్యాంకులలో అసైన్డ్​ భూములకు రుణాలు ఇవ్వడం లేదని, రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని తీర్మానించినట్లు  చైర్మన్​ చెప్పారు. సొసైటీ పరిధిలో ఇప్పటివరకు 519 మంది సభ్యులకు రూ.1.20 కోట్లు మాఫీ కాగా, ఇంకా728 మందికి సంబంధించి రూ.2.20 కోట్లు మాఫీ కావాల్సి ఉందన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ధర్మాజీ, సెక్రటరీ రమేశ్, సిబ్బంది శేఖర్, సాయిరాం, సొసైటీ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.