
కరీంనగర్ జిల్లా : స్వాతంత్ర్య సమరయోధుడు మహాకళ తిరుపతి రెడ్డి(91) కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన మహాకళ తిరుపతి రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మరణించినట్లు తెలిపారు అతడి కుటుంబ సభ్యులు.