మహాకుంభ్2025:ఈ తేదీల్లో ఆ నదుల్లో స్నానం చేస్తే..పాపాలు పోయి..స్వర్గానికి పోతారు

మహాకుంభ మేళా..12 సంవత్సరాలకోసారి వచ్చే హిందువుల మహా సమ్మేళనం. ఇది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినలలో  మహాకుంభ మేళా నిర్వహిస్తారు.. ఈ హిందూ మహా సమ్మేళనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు..గంగా, యమునా , సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేస్తారు. 2025 మహాకుంభమేళా జనవరి 13 సంక్రాంతి రోజు ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ  మహాకుంభ మేళాకు దేశ విదేశాల నుంచి 40 కోట్ల హిందువులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 

2025 మహాకుంభమేళా ప్రత్యేకత, ప్రాముఖ్యత

20258 మహా కుంభమేళా అన్ని కుంభమేళాలలో అత్యంత పవిత్రమైనది. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రత్యేకమైన ఖగోళ పరిణామాలు జరిగే గొప్ప ఈవెంట్. దాదాపు 400 మిలియన్ల మంది సందర్శకులు, హిందువులు వస్తారని తెలుస్తోంది. 

ఇది సాధారణ కుంభమేళా కంటే చాలా ఎక్కువ. 2025 మహాకుంభమేళా లాంటిది తిరిగి 2169 వరకు జరగదు. ఈకుంభ మేళాలో పాల్గొని భక్తులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని మేళా నిర్వాహకులు చెబుతున్నారు.జ్యోతిష్య శాస్త్ర కారకాలు, ముఖ్యంగా గురు గ్రహం, సూర్యుని స్థానాలు ఈ పవిత్రమైన పండుగ సమయాన్ని నిర్ణయిస్తాయని చెబుతున్నారు. ఈ మహా కుంభమేళా సమయంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం (విముక్తి) లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

2025 మహాకుంభమేళా షెడ్యూల్..

ప్రారంభ తేదీ: జనవరి 13, 2025 (పౌష్ పూర్ణిమ)
ముగింపు తేదీ: ఫిబ్రవరి 26, 2025 (మహా శివరాత్రి)

పవిత్ర స్నానాలు..తేదీలు

జనవరి 14, 2025: మకర సంక్రాంతి (మొదటి స్నానం)
జనవరి 29, 2025: మౌని అమావాస్య (రెండవ స్నానం)
ఫిబ్రవరి 3, 2025: బసంత్ పంచమి (మూడవ స్నానం)
ఫిబ్రవరి 12, 2025: మాఘి పూర్ణిమ

కుంభమేళా రకాలు..

మహా కుంభమేళా: ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది.ఇది అత్యంత పవిత్రమైనది.
పూర్ణ కుంభమేళా: నాలుగు ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
అర్ధ కుంభమేళా: ప్రయాగ్‌రాజ్ ,హరిద్వార్‌లలో ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
మాఘ మేళా: మాఘ మాసంలో (జనవరి--ఫిబ్రవరి) ప్రయాగ్‌రాజ్‌లో సంవత్సరానికోసారి జరుగుతుంది.

వసతి, టెంట్ బుకింగ్ లకోసం.. 

యాత్రికులు ప్రాథమిక గుడారాల నుంచి లగ్జరీ సెటప్‌ల వరకు వసతిని బుక్ చేసుకోవచ్చు.రిజర్వ్ చేయడానికి IRCTC టూరిజం లేదా Kumbh.gov.in వంటి అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి.రాత్రి బస చేసేందుకు వివిధ రకాల టెంట్లు అందుబాటులో ఉన్నాయి. టెంట్ రకాన్ని బట్టి రాత్రికి రూ.1500 నుంచి రూ.35వేల వరకు ఛార్జీలు ఉంటాయి.