కుంభమేళా ముగిసే టైంలో ఆకాశంలో అద్భుతం... ఒకే చోట ఏడు గ్రహాలు కవాతు..

కుంభమేళా ముగిసే టైంలో ఆకాశంలో అద్భుతం... ఒకే చోట ఏడు గ్రహాలు కవాతు..

ఆకాశంలో ఎప్పుడూ వింతలు జరుగుతూనే ఉంటుంది. వాటిని మనం నేరుగా చూడలేం. కాని కుంభమేళా ముగిసే టైంలో  ఫిబ్రవరి 26 న భారతదేశంలో ఏడు గ్రహాల అద్భుత విన్యాసాన్ని నేరుగా చూడొచ్చు. ఈ గ్రహ విన్యాసం ఎప్పుడు, ఎలా చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్ లోకి వస్తాయి కదా.. అలాగే ఇప్పుడు  ఫిబ్రవరి 26 న మహా కుంభమేళా ముగింపు రోజున  రాత్రి వేళ సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్,  నెప్ట్యూన్  ఒకే లైన్ లోకి రానున్నాయి. 

గ్రహాల విన్యాసం ఓ అరుదైన ఖగోళ సంఘటన. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్  నెప్ట్యూన్ -అనే ఏడు గ్రహాలు  ఆకాశంలో ఒకే చోట  కవాతు చేయనున్నాయి.  గ్రహాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ .. వాతావరణంలో వచ్చే  మార్పులను శాస్త్రవేత్తలు లెక్కిస్తుంటారు. సౌర గ్రహ కూటమిలోని గ్రహాల కదలికలనే కాకుండా ఇతర నక్షత్ర కుటుంబాల్లో గ్రహాలను కూడా మన సైంటిస్టులు కనిపెడుతుంటారు. 

ఫిబ్రవరి 26 వ తేదీన మహా కుంభమేళా ముగుస్తుంది.   ఈక్రమంలో ఖగోళంలో ఓ సంఘటన జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆరోజు రాత్రి ఆకాశంలో  సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు ఒకే లైన్​ లో  కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్,  నెప్ట్యూన్ - రాత్రి సమయంలో  కనపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2025 జనవరి నెలలోశుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్ , నెప్ట్యూన్ ఒకే లైన్​లో కనువిందు చేశాయి. అయితే ఫిబ్రవరి 26న ఈ లైన్​ లోకి శుక్రడు కూడా చేరనున్నాడు.  ఈ గ్రహాలన్నీ సూర్య గ్రహానికి ఒక వైపున చేరి కవాతును సృష్టిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుని కక్ష్య ఒకే తలంలో ఉండటం వలన.. ఆకాశంలో సూర్యుని స్పష్టమైన మార్గంలో  ఈ ఏడు గ్రహాలు ఉంటాయి. 

ఒకే వరుసలో కనిపించే ఏడు గ్రహాలలోఐదు గ్రహాలు ( బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి , శని -) స్పష్టంగా కనపడుతాయి.  యురేనస్ ,  నెప్ట్యూన్ చాలా మసకగా ఉండటం వలన బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్  లను ఉపయోగించి చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రహాల విన్యాసం స్పష్టంగా చూడాలంటే తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశంలో చూడొచ్చు. ఆకాశం స్పష్టంగా కనిపించాలి. సూర్యాస్తమయం తర్వాత ... లేదా..  తెల్లవారుజామున గ్రహాల విన్యాసం స్పష్టంగా కనపడుతుంది . టెలిస్కోప్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది.మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఆకాశంలో ఒకే చోట, అందమైన వరుసలో కనిపిస్తే దాన్ని గ్రహాల విన్యాసం అంటారు. గ్రహాల కక్ష్యలు, భూమి నుంచి చూసే కోణం వల్ల అవి వరుసలో ఉన్నట్టు కనిపిస్తాయి.

గ్రహాల విన్యాసం ఓ అరుదైన ఖగోళ సంఘటన. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్  నెప్ట్యూన్ -అనే ఏడు గ్రహాలు  ఫిబ్రవరి 26 మహాకుంభమేళా చివరి రోజున రాత్రి వేళ ఆకాశంలో ఒకే చోట  కవాతు చేయనున్నాయి.  గ్రహాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ .. వాతావరణంలో వచ్చే  మార్పులను శాస్త్రవేత్తలు లెక్కిస్తుంటారు. సౌర గ్రహ కూటమిలోని గ్రహాల కదలికలనే కాకుండా ఇతర నక్షత్ర కుటుంబాల్లో గ్రహాలను కూడా మన సైంటిస్టులు కనిపెడుతుంటారు. 

ఈ అనంత విశ్వంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని గమనిస్తూ శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్ర రహస్యాలను కనిపెడుతుంటారు. సైంటిస్టులు కాబట్టి వారి వద్ద ఉన్న పెద్ద పెద్ద పరికరాలు, టెలీస్కోప్ లను ఉపయోగించి యూనివర్స్ లో రహస్యాలను తెలుసుకుంటారు. ఆకాశంలో ఎప్పుడు ఏం జరుగుతుంతో ముందే కనిపెడతారు. గ్రహాలు, గ్రహ శకలాల కదలికల వల్ల భూమిపై కలిగే మార్పులను అంచనా వేస్తుంటారు.