మరోకొన్ని రోజుల్లో యూపీ ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా..12యేళ్ల కోసారి జరిగే ఈ కుంభమేళాను ఘనంగా నిర్వహిస్తుంది యూపీ ప్రభుత్వం. దేశ విదేశాలనుంచి లక్షలాది మంది సాధువులు, సనాతన ధర్మకర్తలు తరలివస్తారు. ఈసారి జనవరి 13నుంచి ఫిబ్రవరి 23 వరకు ఈ మహాకుంభమేళా ఉత్సవాలను నిర్వహించ నున్నా రు. ఈ ఉత్సవాలకు వచ్చే కోట్లాది మంది విజిటర్స్ కోసం ఇండియన్ రైల్వే అధర్వంలోని IRCTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా యూపీలో ప్రయాగ్ రాజ్లో మహాకుంభ్ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తోంది.
వచ్చే ఏడాది (2025) జనవరిలో జరగనున్న మహాకుంభ మేళా కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ్ గ్రామ్ పేరుతో ప్రీమియం టెంట్ సిటీని ఏర్పాటు చేయడానికి సిద్దమవుతోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC). ఈ చారిత్రాత్మక మతపరమైన మేళాలో టూరిజం, తీర్థయాత్ర అనుభవాన్ని ఆస్వాదించేలా, అధ్యాత్మిక వైవిధ్యాన్ని చూపించేలా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు.
Also Read :- చలి కాలంలో కరకరలాడే స్పెషల్ స్నాక్స్
విజిటర్స్ కోసం మహాకుంభ్ గ్రామ్ టెంట్ సిటీకి సంబంధించిన బుకింగ్, రైల్ టూర్ ప్యాకేజీలు, భారత్ గౌరవ్ రైళ్ల కోసం IRCTC ద్వారా అందించబడుతుంది.
ప్రయాగ్ రాజ్ లో.. మహా కుంభ్ గ్రామ్ టెంట్ సిటీ..
ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేస్తున్న మహా కుంభ్ గ్రామ్ టెంట్ సిటీలో డీలక్స్, లగ్జరీ, ప్రీమియం క్యాంపులు ఉంటాయి. ఇక్కడ అథ్యాత్మిక వాతావరణం ఉంటుంది. అల్పాహారం, పాటు రెండు పూటల భోజనంతో ఒక రాత్రికి బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనికి 6వేల నుంచి ఛార్జీ్ చేయబడుతుందని IRCTC డైరెక్ట్ రాహుల్ చెప్పారు.
మహాకుంభ మేళా 2025 ..
కుంభమేళా ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుపుతారు. ఆర్థ కుంభ మేళాను ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు.. ఇక మహా కుంభ మేళా ను ప్రతి 12యేళ్లకు ఒకసారి నిర్వహి స్తారు..పోయిన మహకుంభ మేళాను 2013లో నిర్వహించగా..తర్వాత 2019లో అర్థకుంభ మేళా ఉత్సవాలను జరిపారురు. ఇప్పుడు 2025లో మహాకుంభ మేళాను ఘనం గా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.
మహాకుంభ మేళా 2025 ఉత్సవాలను జనవరి 29,2025న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ సిద్ధియోగాలో నిర్వహించనున్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది పెద్ద పండగ. ఈ పవిత్ర జాతరలో పాల్గొనేందుకు ప్రపంచం నమూల నుంచి సాధువులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. జనవరి 13 న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ మేళా జరగుతుంది.