మహాకుంభమేళా దివ్యాంగులకు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ వారు పుణ్య స్నానాలు చేయడంతో పాటు అవసరమైన ట్రీట్మెంట్ ను ఫ్రీగా పొందుతున్నారు. వారికి ఫ్రీగా కృత్రిమ కాళ్లను కూడా అమర్చుతున్నారు.
జైపూర్‌కు చెందిన నర్వన్ సేవా సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల అవసరాలను తీర్చేందుకు పనిచేస్తున్నది. ఇది పోలియో- బాధితుల చికిత్సకు ప్రసిద్ధి చెందింది. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
ఈ క్యాంపులో 'ఫ్యాబ్రికేషన్' బృందంతో పాటు డాక్టర్లు, ఫిజియోథెరపీ ఎక్స్ పర్ట్స్, ప్రాస్తెటిక్స్ ఎక్స్ పర్ట్స్, సాంకేతిక నిపుణులతో సహా 50 మందితో కూడిన బృందం పనిచేస్తున్నది. ట్రీట్మెంట్ కోసం వచ్చి దివ్యాంగులతో స్వచ్ఛంద సంస్థ శిబిరం కూడా నిండిపోయింది.