మహాకుంభమేళా: ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్ మూసివేత.. ఎందుకంటే..

మహాకుంభమేళా: ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్ మూసివేత.. ఎందుకంటే..

మహాకుంభమేళా సందర్భంగా యూపీలోని ప్రయాగ్ రాజ్కు భారీఎత్తున భక్తులు పోటెత్తారు. రైల్వే స్టేషన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి9) భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్ తాత్కాలికంగా మూసివేశారు. అయితే రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. భక్తులకు తప్పా సాధారణ ప్రజలకు రైల్వే స్టేషన్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్ రాజ్ కు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఇప్పటివరకు 150 ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేశారు.. మరో 200 రైళ్లను నడిపించ నున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది మోహరించారు. మహాకుంభ మేళా ప్రారంభమై  26 రోజులు గడిచింది. ఇప్పటివరకు దాదాపు 42కోట్ల కు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. 

ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ 'వన్ వే ప్లాన్'

పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్‌రాజ్ రైల్వేస్టేషన్‌లో వన్-వే ప్రణాళికను తదుపరి నోటీసు వచ్చేవరకు పొడిగించాలని నిర్ణయించింది. వన్ వే ప్లాన్' ప్రకారం..ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద ప్రయాణీకుల ప్రవేశం ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వద్ద నగరం వైపు నుంచి మాత్రమే అనుమతించబడుతుంది. అయితే ప్లాట్‌ఫాం నం6,10 వద్ద సివిల్ లైన్స్ వైపు నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది.