సోమవారం (ఫిబ్రవరి10) కుంభమేళాకు రాష్ట్రపతి..త్రివేణి సంగమంలో పవిత్రస్నానం

సోమవారం (ఫిబ్రవరి10) కుంభమేళాకు రాష్ట్రపతి..త్రివేణి సంగమంలో పవిత్రస్నానం

ప్రయాగ్ రాజ్:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం(ఫిబ్రవరి10) కుంభమేళాకు వెళ్లనున్నారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, జమునా, సరస్వతి నదులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయనున్నారు. రాష్ట్రపతి ప్రయాగ్ రాజ్ పర్యటనను ఆదివారం రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. 

పౌష్ పూర్ణిమ (జనవరి 13)న  ప్రారంభమైన మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక,సాంస్కృతిక సమ్మేళనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఈ మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు  మహాకుంభమేళా కొనసాగుతుంది.

ప్రయాగ్ రాజ్ లో 8గంటల పాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వివిధ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా త్రివే ణి సంగమం వద్ద పవిత్రస్నానం, తర్వాత అక్షయవత్, బడే హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు యూపీ సీఎం ఆదిత్యానాథ్ ఈ పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. 

సోమవారం హోలిడిప్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చారిత్రక క్షణం అవుతుంది. పవిత్ర నదులల్లో స్నానమాచరించిన ప్రముఖుల్లో ఆమె చేరుతారు. భారత దేశపు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర్ ప్రసాద్ కూడా మహాకుంభమేళా సమయంలో పవిత్ర స్నానం ఆచరించారు. 

మహాకుంభమేళా సందర్శన ప్రయాగ్‌రాజ్ ప్రజలకు మాత్రమే కాకుండా లక్షలాది మంది భక్తులకు లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక,చారిత్రక ప్రాముఖ్యతను కలిగి స్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి హాజరు ఆధ్యాత్మిక,సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.