కుంభమేళాకు ఉచిత రైళ్లు ప్రకటించింది గోవా ప్రభుత్వం.. పనాజీ నుండి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వరకు మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది గోవా ప్రభుత్వం. కుంభమేళా వెళ్లే భక్తులు ఈ రైళ్లల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. గురువారం ( ఫిబ్రవరి 6 ) ఉదయం 8 గంటలకు దక్షిణ గోవాలోని మార్గోవా రైల్వే స్టేషన్ నుండి మొదటి రైలు బయలుదేరుతుందని.. మిగిలిన రెండు రైళ్లు ఫిబ్రవరి 13, 21 తేదీలలో మార్గోవా నుండి బయలుదేరుతాయని తెలిపింది ప్రభుత్వం.
గోవా, ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేకంగా నడిచే ప్రతి రైలు దాదాపు 1,000 మంది ప్రయాణికులను తీసుకువెళుతుందని సమాచారం. ఈ స్పెషల్ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఉచిత ప్రయాణంతో పాటు, ఉచిత భోజనం కూడా అందించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.
Also Read : అంత పుణ్యం, మోక్షం వచ్చేది ఉంటే.. మీరే వెళ్లి కుంభమేళాలో చచ్చిపోండి
పనాజీ నుండి 34 గంటల ప్రయాణం తర్వాత రైళ్లు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటాయని.. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత, భక్తుల వసతి, ఆహారాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తమదేనని తెలిపింది ప్రభుత్వం. 24 గంటల తర్వాత భక్తులు ప్రయాగ్‌రాజ్ నుండి తిరుగు రైలు ఎక్కాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం.
ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యోజనలో భాగంగా ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది ప్రభుత్వం.18 నుంచి 60 ఏళ్ల వయసు వారు, ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు లేని వారు ఈ రైళ్లలో ప్రయాణించడానికి అర్హులు అని తెలిపింది ప్రభుత్వం.