మోనాలిసానా మజాకా: రూ. 35 వేల కోసం వెళ్తే.. 35 లక్షల ఆఫర్ వచ్చింది

మోనాలిసానా మజాకా: రూ. 35 వేల కోసం వెళ్తే.. 35 లక్షల ఆఫర్ వచ్చింది

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా.. ఇప్పుడు సోషల్ మీడియా బ్యూటీ అయిపోయింది. కుంభమేళాలో ఒకే ఒక్క రోజులో.. ఒకే ఒక్క నిమిషం వీడియోతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఈమెను మోస్ట్ పాపులర్ ఇండియన్ బ్యూటీగా వర్ణిస్తూ సోషల్ మీడియా హోరెత్తింది. ఇప్పుడు మోనాలిసాకు ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. 

అసలు మోనాలిసా టార్గెట్ ఏంటో తెలుసా.. కుంభమేళా జరిగే 35 రోజుల్లో.. రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున సంపాదించాలనే లక్ష్యంతో కుంభమేళాకు వచ్చింది. నాలుగో రోజు తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ఇప్పుడు ఏకంగా 35 లక్షల రూపాయల ఆఫర్స్ వచ్చింది. ఇందులో డైరీ ఆఫ్ మణిపూర్ ఫిల్మ్ లో లీడ్ రోల్ చేస్తుంది. అందు కోసం ఆమె సదరు సినిమా నిర్మాతల నుంచి 21 లక్షల రూపాయల చెక్ అందుకుంది. ఇక లోకల్ బిజినెస్ వాళ్లు.. తమ పబ్లిసిటీ కోసం మరో 15 లక్షలతో డీల్స్ చేసుకున్నారంట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. 

ALSO READ | మంగళవారం 2లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. పాయల్ ని అందుకే తొలగించారా.?

35 వేల రూపాయలు సంపాదించాలని కుంభమేళాకు వచ్చిన మోనాలిసా.. ఇప్పుడు ఏకంగా 35 లక్షలు సంపాదించింది. జీవితం మారటానికి.. అదృష్టం ఉంటే ఎలాగైనా వస్తుంది అనటానికి మోనాలిసా జీవితం ఎగ్జాంపుల్ అంటున్నారు నెటిజన్లు.