మహాలక్ష్మి ప్రొఫైల్స్​కు అవార్డు

మహాలక్ష్మి ప్రొఫైల్స్​కు అవార్డు

హైదరాబాద్, వెలుగు: పెద్ద పరిశ్రమల విభాగంలో సమర్థవంతమైన పనితీరు కనబర్చినందుకు మహాలక్ష్మి ప్రొఫైల్స్ ఎఫ్​టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డును పొందింది.  రాష్ట్ర పరిశ్రమలు  ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు చేతులు మీదుగా రెడ్ హిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫెడరేషన్ హౌస్​లో బనితా అగర్వాల్,  సౌమ్య అగర్వాల్,   శ్రియా అగర్వాల్ ఈ అవార్డును తీసుకున్నారు.

1959లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటి రీ-రోలింగ్ స్టీల్ మిల్లును తాము ఏర్పాటు చేశామని వీళ్లు తెలిపారు. మొదటి నుంచి ఎంపీఎల్​ గ్రూప్ మెటల్ పరిశ్రమ కోసం అత్యుత్తమ ఉత్పత్తులను తయారు చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. దేశ అవసరాలకు అనుగుణంగా తాము ఇనుము,  ఉక్కు పరిష్కారాలను అందించడం తమ లక్ష్యమని బనిత చెప్పారు.