మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం మేడారంలో ప్రభుత్వం రూ.105 కోట్లతో భక్తులకు సౌలత్​లు కల్పిస్తున్నది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఫిబ్రవరి21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

మహాలక్ష్మి స్కీం కింద పల్లెవెలుగు, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సుల్లో జాతరకు వచ్చే మహిళలకు ప్రభుత్వం ఫ్రీ జర్నీ వసతి కల్పిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల బస్సుల్లో సుమారు 40 లక్షల మంది భక్తులను తీసుకురావడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఇప్పటికే మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. 47 క్యూలైన్లు నిర్మించారు. 70 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులను పర్యవేక్షిస్తున్నామని వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం శ్రీలత ప్రకటించారు. ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తున్నది. బస్సుల్లో వచ్చే భక్తులు గద్దెలకు అర కిలోమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరందాకా చేరుకోవచ్చు.  ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ప్రకటించారు. 

Also Read : మేడారం జాతరలో వేర్వేరు మార్గాల్లో పార్కింగ్