కాకా కుటుంబంతోనే పెద్దపల్లి అభివృద్ధి : బొంకూరు కైలాసం

కాకా కుటుంబంతోనే పెద్దపల్లి అభివృద్ధి : బొంకూరు కైలాసం

పెద్దపల్లి, వెలుగు: గతంలో కాకా కుటుంబంతోనే  పెద్దపల్లి పార్లమెంట్​నియోజకవర్గం అభివృద్ధి చెందిందని,  రాబోయే ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను ఇక్కడి నుంచి గెలిపించుకోవాలని మహనీయుల ఆశయ సాధన సమితి అధ్యక్షుడు బొంకూరు కైలాసం పిలుపునిచ్చారు. గురువారం పెద్దపల్లి ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.  వంశీని గెలిపించుకుంటే దళిత జాతి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో పెద్దపల్లి నుంచి మాల, మాదిగ, నేతకాని కులస్తులు గెలిచారన్నారు. ప్రస్తుతం మాదిగలకు టికెట్ కేటాయించాలంటూ ర్యాలీలు,  ధర్నాలు చేస్తున్నారని, కానీ వాటిల్లో స్థానికేతరులే ఉంటున్నారన్నారు. 

మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి, ఎంపీగా వివేక్​ వెంకటస్వామిలు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. కాకా వారసుడిగా వంశీకృష్ణకు కాంగ్రెస్​ టిక్కెట్​ ఇవ్వాలని, ఆయనను గెలిపించుకోవడానికి తామంతా కృషి చేస్తామని కైలాసం తెలిపారు. ఇప్పటికైనా మాదిగ సామాజిక వర్గంతో పాటు మిగతా కులాల ప్రతినిధులు ఆలోచించాలని సూచించారు. సమావేశంలో కండె కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర నాయకులు పాల్గొన్నారు