Maharashtra Elections : మహారాష్ట్రలో ముగిసిన ఎన్నికల ప్రచారం..

Maharashtra Elections : మహారాష్ట్రలో ముగిసిన ఎన్నికల ప్రచారం..

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నవంబర్ 18న ముగిసింది.  ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బేలాపూర్, అక్కల్ కోట్ లో..నితిన్ ఘడ్కరీ గోండియానాలో  ప్రచారం చేశారు.   ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పుణె, అహిల్యానగర్ లో ప్రచారం చేశారు. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బారామతితో పాటు అష్టీ, ఫల్తానా ఇందాపుర్ లో ప్రచారం చేశారు.

ఫాక్స్ కాన్, ఎయిర్ బస్ సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి గుజరాత్ కు తరలిపోయాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీని వల్ల మహారాష్ట్ర యువత ఉద్యోగాలు కోల్పోయాయని అన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలో రూ. 3000 జమ చేస్తామన్నారు. 

 పోలింగ్ కు అంతా రెడీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.  మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నవంబర్ 23న ఫలితాల వెలువడనున్నాయి

ALSO READ | ఇద్దరు గుజరాతీలది దోపిడి ప్లాన్..మోదీ, అదానిపై సీఎం రేవంత్ ఫైర్

మహాయుతిలో భాగంగా బీజేపీ  149 స్థానాల్లో ..సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81, అజిత్ పవార్ లోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(MVA) కాంగ్రెస్,ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్ 101,శివసనేన యూబీటీ 95,శరద్ పావర్ పార్టీ 86 చోట్ల బరిలోకి దిగింది.