మహారాష్ట్ర ఎన్నికలు: 14 మందితో కాంగ్రెస్ నాలుగో జాబితా

మహారాష్ట్ర ఎన్నికలు: 14 మందితో కాంగ్రెస్ నాలుగో జాబితా

రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం (అక్టోబర్ 27) 14 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసింది. అంధేరీ వెస్ట్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా సచిన్ సావంత్ స్థానంలో అశోక్ జాదవ్‌ను ఎంపిక చేసింది. 

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 99 మంది అభ్యర్థులను ప్రకటించింది. అంతకుముందు శనివారం, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు 16 మంది అభ్యర్థులతో కూడిన మూడవ జాబితాను పార్టీ విడుదల చేసింది

నాలుగో లిస్ట్ అభ్యర్థుల జాబితా:

  1. అమల్నేర్: డాక్టర్ అనిల్ నాథు షిండే 
  2. ఉమ్రేడ్ (SC): సంజయ్ నారాయణరావు మెష్రామ్ 
  3. ఆర్మోరి (ఎస్టీ): రాందాస్ మాస్రం 
  4. చంద్రపూర్ (SC): ప్రవీణ్ నానాజీ పడ్వేకర్ 
  5. బల్లార్‌పూర్: సంతోష్‌సింగ్ చందన్‌సింగ్ రావత్ 
  6. వరోరా: ప్రవీణ్ సురేష్ కాకడే 
  7. నాందేడ్ నార్త్: అబ్దుల్ సత్తార్ అబ్దుల్ గఫూర్ 
  8. ఔరంగాబాద్ ఈస్ట్: లాహు హెచ్. షెవాలే (మధుకర్ దేశ్‌ముఖ్ స్థానంలో) 
  9. నలసోపరా: సందీప్ పాండే 
  10. అంధేరీ వెస్ట్: అశోక్ జాదవ్ (సచిన్ సావంత్ స్థానంలో) 
  11. శివాజీనగర్: దత్తాత్రే బహిరత్ 
  12. పూణే కంటోన్మెంట్ (SC): రమేష్ ఆనందరావు భాగ్వే 
  13. షోలాపూర్ సౌత్: దిలీప్ బ్రహ్మదేవ్ మానె 
  14. పండర్‌పూర్: భగీరథ భాల్కే

నవంబర్ 20న ఎన్నికలు

మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కాంగ్రెస్-ఎన్‌సిపిఎస్‌పి-శివసేనయుబిటి యొక్క మహా వికాస్ అఘాడి సంకీర్ణం నుండి సవాలును ఎదుర్కొంటోంది.

Also Read :- అది రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్

2019 ఎన్నికల ఫలితాలు

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, మొత్తం 288 స్థానాల్లో బీజేపీ 105 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 సీట్లు గెలుచుకోగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్ వరుసగా 54, 44 సీట్లు గెలుచుకున్నాయి.