మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహా సంగ్రామాన్ని తలపించాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీకి నేడు(నవంబర్ 20) ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఇప్పటికే పోలింగ్ ముగియగా.. ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 కాగా.. ఏ సర్వే ఏం చెప్తోంది అనేది చూద్దాం..
మ్యాట్రిజ్
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
- మహాయుతి: 150 - 170 స్థానాలు
- మహా వికాస్ అఘాడీ కూటమి: 110 - 130 స్థానాలు
- ఇతర పార్టీలు: 8 - 10 స్థానాలు
P-MARQ
- మహాయుతి: 137 - 157 స్థానాలు
- మహావికాస్ అఘాడీ: 126 - 146 స్థానాలు
- ఇతరులు: 2- 8 స్థానాలు
పీపుల్స్ పల్స్
- మహాయుతి కూటమి: 175 - 195 స్థానాలు
- మహావికాస్ అఘాడీ: 85 - 112 స్థానాలు
- ఇతరులు: 7 - 12 స్థానాలు
చాణక్య
- బీజేపీ మహాయుతి కూటమి: 152 - 160 స్థానాలు
- కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ: 130 - 138 స్థానాలు
- ఇతరులు: 6 - 8 స్థానాలు
పోల్ డైరీ
- మహాయుతి:122 - 186 స్థానాలు
- మహా వికాస్ అఘాడి: 69 - 121 స్థానాలు
- ఇతర పార్టీలు: 12 - 29 స్థానాలు
లోక్‌షాహి మరాఠీ రుద్ర
- మహాయుతి :128 - 142 స్థానాలు
- మహా వికాస్ అఘాడి: 125 - 140 స్థానాలు
- ఇతర పార్టీలు: 18 - 23 స్థానాలు
కాంగ్రెస్ కూటమికి జై కొట్టిన దైనిక్ భాస్కర్
దైనిక్ భాస్కర్ ఇతర ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా మహా వికాస్ ఆఘాఢీ కూటమికి విజయాన్ని కట్టబెట్టింది.
- మహా వికాస్ అఘాడి: 135 - 150 స్థానాలు
- మహాయుతి :125 - 140 స్థానాలు
- ఇతరులు: 20 - 25 స్థానాలు
CNN
- మహాయుతి: 154 స్థానాలు
- మహా వికాస్ అఘాడీ: 128 స్థానాలు
- ఇతరులు: 6 స్థానాలు
టైమ్స్ నౌ
- మహాయుతి: 105 -126 స్థానాలు
- మహా వికాస్ అఘాడీ: 68 - 91 స్థానాలు
- ఇతరులు: 8 - 12 స్థానాలు
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి, కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమిలదే ప్రధాన పోరు. మహాయుతి కూటమి నుంచి బీజేపీ 149, శివసేన 81, ఎన్ సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్ సీపీ శరద్ పవార్ వర్గం 86 స్థానాల్లో తలపడుతున్నాయి.