సుప్రియాకు క్షమాపణలు చెప్పిన చంద్రకాంత్

ముంబై:   మహారాష్ట్ర బీజేపీ చీఫ్ ​చంద్రకాంత్ పాటిల్ ఆదివారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలేకు క్షమాపణలు చెప్పారు. బుధవారం ఓబీసీల రిజర్వేషన్లపై ఆందోళన సందర్భంగా పాటిల్ నోరు జారారు. సుప్రియ రాజకీయాలు చేసుడుకు బదులు ఇంటికెళ్లి వంట చేస్కోవడం బెటర్ అని కామెంట్ చేశారు. దీనిపై దుమారం రేగడం, క్షమాపణలు చెప్పాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు పంపడంతో పాటిల్ ఆదివారం స్పందించారు. ఆందోళన సందర్భంగా తాను ఓ సామెతను ప్రస్తావిస్తూ కామెంట్ చేశానన్నారు. ఎవరినీ నొప్పించాలని అనుకోలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం పట్ల బాధపడుతున్నానని ఆయన మహిళా కమిషన్​కు లేఖ రాశారు.