![రాబోయే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు : పరాగ్ అల్వానీ](https://static.v6velugu.com/uploads/2023/08/Maharashtra-BJP-MLA-Parag-Alwani-said-that-BJP-will-win-the-ts-elections_YzAdRaxK7U.jpg)
- మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ అల్వానీ
సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణలో బీజేపీకి జనాల మద్దతు బలంగా ఉందని.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని మహారాష్ట్రలోని విలే పార్లే సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ అల్వానీ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీకా రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తార్నాకలో జరిగిన బూత్ లెవెల్ సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరాగ్ అల్వానీ మాట్లాడుతూ.. 3 నెలల పాటు నాయకులు, కార్యకర్తలు జనాలతో మమేకం కావాలన్నారు.
పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా సక్సెస్ చేసేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పరాగ్ వివరించారు. సమావేశంలో ఉస్మానియా వర్సిటీ అధ్యాపకులు, కుల సంఘాల ప్రతినిధులు. కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు, బీజేపీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, రాము, హరి తదితరులు పాల్గొన్నారు.