ముంబైలో బీఎండబ్ల్యూ బీభత్సం.. మహిళ మృతి

ముంబైలో బీఎండబ్ల్యూ బీభత్సం..  మహిళ మృతి

మహరాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది.  ఇవాళ ఉదయం వర్లీలో అతివేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ఓ స్కూటర్ ను ఢీ కొట్టింది. దీంతో స్కూటర్ పై వెళ్తున్న  మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 

 ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి కారణమైన  కారు  సీఎం  ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లీడర్ రాజేష్ షాదిగా ( మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా) గుర్తించారు.  ప్రమాద సమయంలో కారు  రాజేషాకు చెందిన కుమారుడు.. అతని డ్రైవర్ తో కలిసి ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మిహిర్ షా ఘటన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మిహిర్ షా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన మహిళను వర్లి కోలివాడ నివాసి కావేరి నఖ్వాగా గుర్తించారు.  

పోలీసుల  వివరాల ప్రకారం.. మిహిర్ షా జూలై 6న రాత్రి జుహులోని ఓ బార్‌లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్‌ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. కారు వర్లీకి రాగానే మిహిర్ తాను డ్రైవ్ చేస్తానని పట్టుబట్టాడు. అతను కారు స్టీరింగ్ తీసుకోగానే వేగంగా ఉన్న బీఎండబ్ల్యూ   స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటర్ పై ఉన్నదంపతుల్లో భార్య చనిపోగా..భర్తకు గాయాలయ్యాయి. 

 వర్లీలోని కోలివాడ ప్రాంతానికి చెందిన కావేరి నక్వా, ఆమె భర్త ప్రదిక్ నక్వా  చేపలు అమ్ముతారు. రోజూ మాదిరి సస్సూన్ డాక్‌కి చేపలు తీసుకురావడానికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా బీఎండబ్ల్యూ  స్కూటర్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ గాలిలోకి దూసుకెళ్లి కారు  బానెట్‌పై పడింది. కారు వేగంగా వెళ్తుండడంతో కావేరీ నక్వాపైకి దూసుకెళ్లింది. దీంతో మహిళ మృతి చెందింది. వెంటనే  కారు అక్కడి నుండి పారిపోయింది.  ఆమె భర్త ప్రదిక్‌కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.  పోలీసుల విచారణలో  సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది.

అయితే ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ఘటనకు కారణమైన నిందితులపై  చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని.. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు.