క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్..ఉద్యోగం ఊస్ట్

 క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్..ఉద్యోగం ఊస్ట్

మొబైల్ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించింది మహారాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం. డ్రైవర్ స్మార్ట్ ఫోన్ లో క్రికెట్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుండగా..ఓ ప్రయాణికుడు వీడియో చేసి ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కి పంపించారు. మంత్రి ఆదేశాల మేరకు రవాణాశాఖ డ్రైవర్ పై చర్యలు తీసుకుంది. 

మార్చి 22న  ముంబై, పూణె మార్గంలో ఈశివనేరి బస్సులో ఈ సంఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్.. బస్సు డ్రైవర్ క్రికెట్ మ్చార్ చూస్తున్న వీడియోను తన మొబైల్ ఫోన్ లో రికార్డు చేసి ఆ క్లిప్ ను మహారాష్ట్ర రవాణా శాఖా మంత్రికి పంపించారు. దీంతోపాటు సీఎం దేవేంద్రఫడ్నవీస్, ఇతర మంత్రులకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో చూసిన రోడ్డు రవాణా శాఖ మంత్రి సంబంధిత అధికారులకు డ్రైవర్ చర్యలు తీసుకోవాలని సీనియర్ MSRTC అధికారులను ఆదేశించారు.మంత్రి ఆదేశాలతో స్థానిక అధికారులు ప్రయాణీకుల భద్రతకు హాని కలిగించినందుకు ఓ ప్రైవేట్ బస్సు ఆపరేటర్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌ను తొలగించారు. దీంతోపాటు ప్రైవేట్ కంపెనీకి రూ.5వేలు జరిమానా విధించారు.

ముంబైనుంచి -పుణె మార్గంలో ఈ- శివనేరి కీలకమైన సర్వీసు. ఈ బస్సులో చాలా మంది ప్రయాణిస్తారు. ఈ సర్వీసు ప్రమాదరహితంగా ఉండటంతో ప్రసిద్ధి చెందింది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రయాణీకులకు ప్రమాదం కలిగించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని మంత్రి సర్నాయక్ అన్నారు.