T20 World Cup 2024: టీమిండియాకు ప్రైజ్ మనీ ప్రకటించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

T20 World Cup 2024: టీమిండియాకు ప్రైజ్ మనీ ప్రకటించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే ఐసీసీ.. బీసీసీఐ భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియాకు మరో నజరానా దక్కింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రూ. 11 కోట్ల ప్రైజ్ మనీని భారత జట్టుకు ప్రకటించారు. ముంబై వాంఖడేలో విజయోత్సవాలు ముగిసిన తర్వాత శుక్రవారం(జూలై 5) విధాన్ భవన్ సెంట్రల్ హాల్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేలను సీఎం సన్మానించి నజరానాను ప్రకటించారు.

ముంబై ప్లేయర్లలో యశస్వి జైస్వాల్ మినహాయిస్తే మిగిలిన ముగ్గురు ఆటగాళ్లకు తుది జట్టులో స్థానం దక్కింది.  ఫైనల్ మ్యాచ్ లో తన క్యాచ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పిన సూర్య కుమార్ యాదవ్ పై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రశంసలు కురిపించారు. రోహిత్ స్పీచ్ హైలెట్ గా మారింది. ఈ కార్యక్రమంలో క్రికెటర్లతో పాటుగా టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా ఉన్నారు.

వరల్డ్ కప్ అనంతరం టీ20 ప్రపంచ కప్ గెలుచుకు భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ICC T20 ప్రపంచ కప్ చరిత్రలో టోర్నమెంట్‌ను అజేయంగా గెలుచుకున్న మొదటి జట్టు అని ’’ బీసీసీఐ చైర్మన్ జై షా అభినందించారు.  రోహిత్ కెప్టెన్సీలో భారత్ జట్టు అద్భుతమైన విజయం  సాధించినందుకు..టీమిండియా జట్టుకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ టోర్నీ విజేతగా నిలిచిన ఇండియాకు 2.45 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించనుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 20.42 కోట్లు.