
ముంబై: అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.1500 ఇచ్చే సీఎం మాఝీ లాడ్కి బహిన్ యోజన అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా పనిచేసిందని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. కూటమిలో అత్యధిక సీట్లు పొందిన పార్టీకే సీఎం పదవి ఇవ్వాలన్న ఆలోచన లేదన్నారు. సీఎం షిండే శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘‘మా కూటమికి ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రభుత్వ పనితీరుకు బ్యాలట్ ద్వారా స్పందిం చి తీర్పు చెప్పారు. నెలా నెలా రూ.1500 ఇచ్చే లాడ్కి బహిన్ పథకం గేమ్ చేంజర్‌గా పనిచేసింది” అని అన్నారు.