మహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా..ఫడ్నవిస్కు లైన్ క్లియర్

మహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా..ఫడ్నవిస్కు లైన్ క్లియర్

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్ భవన్ లో  గవర్నర్  సీపీ రాధాకృష్ణకు అందజేశారు. షిండే వెంట దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 288 అసెంబ్లీ సీట్లకు గానూ కూటమి 205 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 105, షిండే శివసేన 56, అజిత్ పవార్ ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి.  

Also Read :- మన రాజ్యాంగం ప్రపంచంలోనే బెస్ట్..మార్చాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరు

దేవేంద్ర ఫడ్నవిస్ కు సీఎంగా చాన్స్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపిందని, ఆయనకు ఎన్ సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఓకే చెప్పారని  మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి.  షిండే, అజిత్ పవార్ లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారని ప్రచారం జరిగింది.