మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ సెషన్స్ లో ముంబైయిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమయిందన్నారు.నోట్లరద్దు, మణిపూర్ , కొవిడ్ అంశాల్లో ప్రత్యేక సెషన్స్ పెట్టని మోదీ..ఇపుడు ముంబైయిని మహారాష్ట్ర నుంచి విడదీసేందుకు సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. ముంబైతో పాటు బాంబే, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లను గుజరాత్ లకు తరలించే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు పటోలే.
ముంబయి ఒక అంతర్జాతీయ నగరం, ఆర్థిక రాజధాని. ఇప్పుడు ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ , డైమండ్ మార్కెట్ వంటి ముంబైలోని పవర్‌హౌస్‌లు నగరం నుండి తరలించబడుతున్నాయని పటోలే ఆరోపించారు.
Also Read : తక్కువ ఖర్చుతో నేపాల్, థాయ్‌లాండ్ చుట్టేయండిలా.. IRCTC కొత్త టూర్ ప్యాకేజెస్
సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కేంద్రం ఎజెండాను కేంద్రం పేర్కొనకపోవడంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.