- నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్ స్థానానికి నామినేషన్
నాగ్‌పూర్: మహారాష్ట్రలో మళ్లీ ‘మహాయుతి’ కూటమిదే అధికారమని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తంచేశారు. తమ పాలన, తాము అమలుచేసిన సంక్షేమ పథకాలే మళ్లీ అధికారం తెచ్చిపెడతాయని తెలిపారు. శుక్రవారం నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్ నియోజకవర్గ స్థానానికి ఫడ్నవీస్ నామినేషన్ వేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు.
రాష్ట్రంలోని పేద మహిళల సంక్షేమమే లక్ష్యంగా ‘లడ్కీ బహిన్’ స్కీమ్ ను అమలు చేశామని, ప్రతిపక్షాలను ఓడించేందుకు ఆ పథకం లబ్ధిదారులు చాలని అన్నారు. ఈ స్కీమ్‌ను ఆపేందుకు కాంగ్రెస్ లీడర్ సునీల్కేదార్, నానా పటోలే బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారని గుర్తు చేశారు. తమ పనే తమ మాటలకంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు.