మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో స్వతంత్ర అభ్యర్థి మృతి

మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో స్వతంత్ర అభ్యర్థి మృతి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బాలాసాహెబ్ షిండే గుండెపోటుతో పోలింగ్ బూత్‌లోనే ప్రాణాలు విడిచారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన పరిస్థితిని గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, లాభం లేకపోయింది. అప్పటికే, ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ALSO READ | యూపీలో ఏం జరిగింది: ఓటర్లపై తుపాకీ గురి పెట్టిన పోలీస్

అభ్యర్థి ఆకస్మిక మరణంతో బీడ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం త్వరలో తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, ఎన్నికల సమయంలో అభ్యర్థి మరణిస్తే, సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్‌ను వాయిదా వేయవచ్చు.