మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే తనకేదో అనుమానం కలుగుతుందంటున్నారు శివసేన (యూబిటీ) నేత సంజయ్ రౌత్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఏదో పెద్ద గోల్ మాల్ జరిగింది.. ఇందులో ఏదో కుట్ర ఉందని ఆరోపించారు. లేకపోతే మహాయుతి కూటమికి ఇంత మెజార్టీ రావడమేందని ప్రశ్నించారు.
‘‘ప్రభుత్వంపట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు..ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉంది..ఇలాంటి సమయంలో మహాయుతి కూటమికి ఇంత మెజార్టీ ఎలా వస్తుందని’’ సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల ఆదేశాన్ని, ఆకాంక్షను ప్రతిబింబించడం లేదన్నారు.
ఇందులో పెద్ద కుట్ర ఉందని అనిపిస్తోందన్నారు సంజయ్ రౌత్? ఇది మరాఠీ మనులు, రైతుల కోరికకు పూర్తి వ్యతిరేకం అన్నారు. మరోవైపు ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు సంజయ్ రౌత్.మహారాష్ట్రకు ద్రోహం చేసిన అజిత్ పవార్ ఎలా గెలుస్తారు.. ఏక్ నాథ్ షిండే ఎమ్మెల్యేలందరూ ఎలా గలిగారని ప్రశ్నించారు.
Also Read :- మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
2024 మహారాష్ట్ర ఎన్నికలపై ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా గణాంకాల ప్రకారం.. బీజేపీ కి చెందిన మహాయుతి కూటమి రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 218 స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది.
అధికార మహాయుతి కూటమిలో బీజేపీ అభ్యర్థులు 149 స్థానాలు, శివసేన 81, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి చతికిలా పడింది. కేవలం 50 స్థానాల్లో మాత్రమే MVA అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.