సీఎం ఎవరనేది ఎన్డీయే డిసైడ్ చేస్తది: దేవేంద్ర ఫడ్నవిస్

సీఎం ఎవరనేది ఎన్డీయే డిసైడ్ చేస్తది: దేవేంద్ర ఫడ్నవిస్

 సీఎం పదవిపై ఎలాంటి వివాదాలు లేవన్నారు మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్. సీఎం ఎవరనేది ఎన్డీయే కూటమి డిసైడ్ చేస్తుందన్నారు .  ఎక్కువ సీట్లు వచ్చిన వారికే సీఎం పదవి ఇవ్వాలన్న రూల్ ఏం లేదన్నారు.  భారీ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మహాయుతిని ఆదరించారని చెప్పారు. . మహా వికాస్‌ అఘాడీ అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. - 

ఈవీఎం ట్యాంపరింగ్ అయితే కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ లో ఎలా గెలిచిందని ప్రశ్నించారు దేవేంద్ర ఫడ్నవీస్‌.  జార్ఖండ్ లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్లు ఓప్పుకుంటారా? అని అడిగారు.   ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు.. ఇది ఎన్డీయే విజయమన్నారు.  షిండే శివసేననే అసలైన శివసేనగా మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని చెప్పారు.  మతం పేరుతో ఓట్లు అడిగిన ఎంవీఏ కూటమిని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.   మహారాష్ట్రఅంతా ఒక్కటిగా ఉందన్నారు. ఏక్ హైత్ సేఫ్ హైన్  నినాదం తమను గెలిపించింది..  దేశ ప్రజలు మోదీ వైపే ఉన్నారని తేలిందన్నారు ఫడ్నవిస్..

ALSO READ | మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాత్రమే.. ఆయనే అవుతారు: బీజేపీ ఎమ్మెల్సీ ఓపెన్ స్టేట్ మెంట్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 231 సీట్లలో..కాంగ్రెస్ కూటమి 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.  మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇక  సీఎం అభ్యర్థి రేసులో దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే..అజిత్ పవార్ పోటీపడుతున్నారు. ఎన్డీయే కూటమి ఎవర్ని సీఎంను చేస్తుందనేది చూడాలి.