మహారాష్ట్ర ఎన్నికలు..ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

మహారాష్ట్ర ఎన్నికలు..ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
  • బారామతి బరిలో అజిత్ పవార్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలిపే అభ్యర్థులను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ పవార్​) బుధవారం ప్రకటించింది. మొత్తం 38 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, పార్టీ చీఫ్ అజిత్ పవార్ పుణె జిల్లాలోని బారామతి నుంచి పోటీ చేయనున్నారు. 

ఇదే స్థానంలో ఎన్సీపీ( శరద్ పవార్‌‌‌‌‌‌‌‌) కు చెందిన యుగేంద్ర పవార్ కూడా పోటీ చేస్తున్నారు. దాంతో ఈ ఎన్నికల్లో బారామతిలో 'పవార్ వర్సెస్ పవార్' పోరు జరగనుంది. బారామతి పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 1993 నుంచి అజిత్ పవార్ ఈ నియోజకవర్గానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన బీజేపీ ప్రత్యర్థిని రికార్డు స్థాయిలో 1,65,000 ఓట్ల తేడాతో ఓడించారు. అజిత్ పవార్ మహాయుతి కూటమిలో చేరినప్పుడు తన పక్షాన నిలిచిన మంత్రులతో సహా 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తన ఫస్ట్ లిస్టులో టికెట్ కేటాయించారు.