మహారాష్ట్రలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌

మహారాష్ట్రలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌
  • ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నందున లాక్‌డౌన్‌ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను ఎక్స్‌టెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మెహతా ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల విడతల వారీగా సడలింపులు ఇస్తారని తెలుస్తోంది. మహారాష్ట్రలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్క రోజు రికార్డు స్థాయిలో 1606 కొత్త కేసులు నమోద కాగా.. వాటిలో ముంబైలోనే 884 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30,706కు చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి 1135 మంది చనిపోయారు. లాక్‌డౌన్‌ విధించడం వల్లే కేసుల సంఖ్య చాలా వరకు తగ్గిందని, అందుకే ఇంకా ఎక్స్‌టెండ్‌ చేయాలని నిర్ణయించామని హెల్త్‌ మినిస్టర్‌‌ రాజేశ్‌ తోపే అన్నారు. మూడో ఫేజ్‌ లాక్‌డౌన్‌ ఆదివారం అర్ధరాత్రి ముగిసిపోనుంది. లాక్‌డౌన్‌ 4.0కి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉండగా.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.