కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ వరంగల్‌‌కు ఎందుకొస్తలే ?: ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు

కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ వరంగల్‌‌కు ఎందుకొస్తలే ?: ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు

వరంగల్‍, వెలుగు : వర్షాలు, వరదలతో ఆగమాగం అవుతున్న వరంగల్‌‌కు వచ్చేందుకు సీఎం కేసీఆర్‌‌, మంత్రి కేటీఆర్‌‌కు టైం లేదా అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌‌ నగరంలోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‍తో కలిసి బుధవారం మీడియాతో  మాట్లాడారు. వరదల కారణంగా జనాలు జనాలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా పార్టీ బలోపేతం కోసం మహారాష్ట్రకు వెళ్లడం సరికాదన్నారు.

ALSO READ:శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నరు: భూక్యా మంజీ నాయక్‌

ఒక్క గ్రేటర్‌‌ వరంగల్‌‌లోనే రూ.427.84 కోట్ల నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తే, రాష్ట్రం మొత్తానికి రూ.500 కోట్లే కేటాయించడమేంటని ప్రశ్నించారు. కేంద్రం రిలీజ్‌‌ చేసిన రూ. 900 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కాలనీలు మునిగిపోతుంటే పట్టించుకోవడం లేదని విమర్శించారు. తామ సొంత డబ్బులతో బాధితులకు సరుకులు పంపిణీ చేస్తుంటే ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రత్నం సతీశ్‌‌ సా, బాకం హరిశంకర్‍, కనుకుంట్ల రంజిత్‍, టేకుమట్ల రేణుక, మార్టిన్‌‌ లూథర్‍, మంతెన అమరీష్‍, బండి సుజాత, గోకే వెంకటేశ్‍ పాల్గొన్నారు.