![మహారాష్ట్రలో ‘ఒక్క రూపాయి క్లినిక్’](https://static.v6velugu.com/uploads/2019/11/maharastra-2.jpg)
లోకల్స్‌కు 80% జాబ్స్
సర్కార్ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రిలీజ్
రైతులకు వెంటనే రుణమాఫీ
సీఎంపీ ప్రియాంబుల్‌లో రెండు చోట్ల ‘సెక్యులర్’
రాజ్యాంగంలోని లౌకిక విలువలను పరిరక్షిస్తామని హామీ
ముంబై: మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రమాణం చేయడానికి కొద్ది గంటల ముందు.. ‘ఆగాధీ’ సర్కార్ ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’ (సీఎంపీ) విడుదల చేసింది. లోకల్స్‌కు 80% జాబ్స్ ఇస్తామని, రైతులకు వెంటనే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ‘సెక్యులర్’ అంశంపై మూడు పార్టీల మధ్య తొలుత వ్యతిరేకత వ్యక్తమైనా.. రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక విలువలను పరిరక్షిస్తామని సీఎంపీలో హామీ ఇచ్చాయి. సీఎంపీలో ప్రియాంబుల్‌లో రెండు చోట్ల సెక్యులర్ అనే పదాన్ని పేర్కొన్నారు. సీఎంపీలో పేర్కొన్న ముఖ్యాంశాలివీ…
రూపాయి క్లినిక్
రాష్ర్టంలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని మెరుగుపరచడంపై దృష్టి. తాలూకా స్థాయి పట్టణాల్లో ‘ఒక్క రూపాయి క్లినిక్’ల ఏర్పాటు. నాణ్యమైన హెల్త్ కేర్‌ను అందించేందుకు రూపాయికే వైద్యం.
ఎడ్యుకేషన్ లోన్స్
ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచేందుకు చర్యలు. రైతు కూలీల పిల్లలకు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు లోన్లు.
టూరిజం సెక్టార్
పర్యాటక రంగాన్ని అభివృద్ధిపై ఫోకస్. సీనియర్ సిటిజన్లకు ఫెసిలిటీస్ పెంపు. సాధారణ జనానికి అందుబాటులోకి ఆహారం.
సామాజిక న్యాయం
ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలకు సామాజిక న్యాయం. ప్రజలందరికీ కూడూ, గూడు, గుడ్డ, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం వంటివి కల్పన. సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనమిక్ వెనుకబాటుతనాన్ని రూపుమాపడంపై దృష్టి.
‘ఇండస్ర్టియల్’ పాలసీ రిపార్మ్స్
పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కొత్త పరిశ్రమలు, పెట్టుబడిదారులకు ఆహ్వానం. ఐటీ సెక్టార్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు రాబట్టుకునేందుకు పాలసీ రిపార్మ్స్.
ఖాళీ పోస్టులు భర్తీకి చర్యలు
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఫెలోషిప్. స్థానిక యువకులకే 80 శాతం జాబ్స్ రిజర్వ్ చేసేందుకు కొత్త చట్టం.
రైతు సంక్షేమం
అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు తక్షణ సాయం. వెంటనే రుణమాఫీ. నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం చేసేలా క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్రివైజ్. కరువు ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులోకి.
ఆడవాళ్లకు సెక్యూరిటీ
ఆడవాళ్లకు సెక్యూరిటీ, ఈడబ్ల్యూఎస్ ఆడపిల్లల విద్య, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌కు సంబంధించిన సమస్యలు, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, అంగన్వాడీ, ఆశా వర్కర్ల గౌరవ వేతనం పెంచడం, సర్వీస్ ఫెసిలిటీలపై దృష్టి.