EV కార్లపైనా పన్ను.. 6 శాతం కట్టాలంటున్న మొదటి రాష్ట్రం ఇదే..!

EV కార్లపైనా పన్ను.. 6 శాతం కట్టాలంటున్న మొదటి రాష్ట్రం ఇదే..!

ముంబై: ఎలక్ట్రికల్ వెహికల్స్.. EV కార్లపై ఇప్పటి వరకు పన్ను లేదు.. కారు కొన్న తర్వాత GST తప్పితే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు మీరు 10 లక్షల రూపాయల విలువైన పెట్రోల్, డీజిల్ కారు కొనుగోలు చేశారంటే ఆర్టీఏ ( రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ)కి పన్నుల కింద లక్ష రూపాయల వరకు చెల్సించాల్సి ఉంటుంది. అదే ఎలక్ట్రికల్ కారు కొనుగోలు చేశారంటే.. కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 10 వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక నుంచి ఆ రాష్ట్రంలో అలా కుదరదు.. ఎలక్ట్రికల్ కారు.. EV కారు కొనుగోలు చేసినా 6 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.. కాకపోతే అన్ని ఈవీ కార్లపై కాకుండా.. లగ్జరీ ఈవీ కార్లు.. ధర ప్రకారం ఈ పన్ను విధిస్తున్న మొదటి రాష్ట్రం ఇదే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలపై 6 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. 2025, ఏప్రిల్ 1 నుంచి ఈ ట్యాక్స్ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు ఏప్రిల్ 2025 నుంచి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 

ALSO READ | ఎయిర్ టెల్ బాటలోనే జియో.. ఎలన్ మస్క్ స్టార్ లింక్‎తో జియో డీల్

దీంతో ఏప్రిల్ నుంచి మహారాష్ట్రలో  రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ కార్లపై 6 పర్సంట్ ట్యాక్స్ వసూల్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈవీ కార్లను కొనాలనుకునే వారు అప్రమత్తమవుతున్నారు. ఏప్రిల్ నెలలో కారు కొందామని ప్లాన్ చేసుకున్న ప్రభుత్వ ప్రకటనతో నిర్ణయం మార్చుకుంటున్నారు. మార్చి 31 లోపే కారు కొనేందుకు రెడీ అవుతున్నారు. మహారాష్ట్ర  ప్రభుత్వ నిర్ణయంతో 2025 మార్చి 31 లోపు ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు భారీగా పెరిగే చాన్స్ ఉందని బిజినెస్ ఎక్స్‎పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

 ఇక.. ఏప్రిల్ తర్వాత రూ.30 లక్షలు దాటిన ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి ప్రభుత్వ నిర్ణయం ఎదురు దెబ్బనేని అంటున్నారు. దేశవ్యాప్తంగా హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో మహారాష్ట్ర సర్కార్ అనుహ్యంగా ఈవీ కార్లపై ట్యాక్స్ విధించడంతో దేశ ఆర్ధిక రాజధానిలో ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు క్షీణించవచ్చిన అంచనా వేస్తున్నారు నిపుణులు. మరోవైపు.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రతిపాదిత పన్ను రాష్ట్ర ఖజానాను పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పన్ను పెంపు వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.320 కోట్లు పెరుగుతోందని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటోంది.