మహారాష్ట్రలో సంతాప దినం : ప్రజల సందర్శనార్థం NCPAలో రతన్ టాటా పార్థివదేహం

మహారాష్ట్రలో సంతాప దినం : ప్రజల సందర్శనార్థం NCPAలో రతన్ టాటా పార్థివదేహం

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా అండ్ సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అనారోగ్యంతో మృతిచెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం (అక్టోబర్ 10) అధికారికంగా రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం రాష్ట్రంలో సంతాప దినాన్ని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని సగానికి ఎగురవేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA)లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియలకు వర్లీ శ్మశానవాటికకు తీసుకెళ్లనున్నారు. రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్రం తరపున హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. వినోద కార్యక్రమాలు కూడా ఉండవు.