రతన్ టాటాకు భారత రత్న! : మహారాష్ట్ర కాబినేట్ ప్రతిపాదన

రతన్ టాటాకు భారత రత్న! : మహారాష్ట్ర కాబినేట్ ప్రతిపాదన

దిగ్గజ పారిశ్రామికవేత్త, ప్రముఖ ఫిలాత్రఫిస్ట్ రతన్ టాటా ఇక లేరన్న విషయం అందరికీ తెలసిందే. అక్టోబర్ 9న భారతదేశం ఓ గొప్ప మనవతా మూర్తిని కోల్పోయింది. మహారాష్ట్ర మంత్రివర్గం అక్టోంబర్ 10ని సంతాప దినంగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తోంది.

భారతరత్న అవార్డుకు ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా పేరును ప్రతిపాదించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ముంబైలోని ఎన్‌సిపిఎలో రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయనకు నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు.

దివంగత పారిశ్రామికవేత్తకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మహారాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ఇది వరకే ఆయనకు లభించింది. 

Also Read :- రతన్ టాటాకు భారత క్రికెటర్లు నివాళులు

కొత్త వ్యాపారాలను నెలకొల్పి దేశాన్ని పురోగతి, అభివృద్ధి పథంలో తీసుకెళ్లవచ్చని ఆయన నిరూపించారని కాబినేట్ గుర్తుచేసుకుంది. దేశం పట్ల ప్రేమ, సమాజ అభ్యున్నతి కోసం నిజాయితీ భావాలుతో రతన్ టాటా పని చేశారని ఆయన సేవలు కొనియాడారు. దేశం పట్ల, సమాజం పట్ల నిబద్ధత కలిగిన ఓ మహానీయుడిని మనం కోల్పోయామన్నారు.