
ముంబై: 2025, ఏప్రిల్ 22 భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేని చీకటి రోజు. మిని స్విట్జర్లాండ్‌గా పిలువబడే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం బెసరన్ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన టెర్రరిస్టులపై ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. తీవ్రవాదుల ఊచకోతలో 26 మంది పర్యాటలకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. తాజాగా మృతులకు కుటుంబాలకు మహారాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన ఆరుగురు మహారాష్ట్రవాసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం (ఏప్రిల్ 29) ప్రకటించారు. మంగళవారం (ఏప్రిల్ 29) సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా మహా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రదాడిలో జీవితాలను కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు.. వారి పిల్లలకు ఉచిత విద్యా అందిస్తామని సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. అలాగే.. కుటుంబాన్ని పోషించడానికి మృతుడి ప్రత్యక్ష బంధువుకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఇప్పటికే పహల్గాం టెర్రర్ ఎటాక్‌లో మరణించిన బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రకటించిన విషయం తెలిసిందే.