మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి విజయం దక్కింది. అక్కడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. జల్గావ్ జిల్లాలోని సవ్ఖేడా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి సుష్మా విష్ణు ములే ఎన్నికయ్యారు. గంగాపూర్ ఖుల్తాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీలో వార్డు సభ్యులుగా పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే అన్నాసాహెబ్ మానె పాటిల్, యువనేత సంతోష్ అన్నాసాహెబ్ మానేతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ విజయం కోసం తీవ్రంగా శ్రమించారని బీఆర్‌ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్ తెలిపారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా మహారాష్ట్రలో పార్టీకి పెరుగుతున్న ప్రజల మద్దతును ప్రతిబింబిస్తోందని మాణిక్ కదమ్ అన్నారు.