![ఇలా ఉన్నారేంట్రా:300 రూపాయల టీ షర్ట్ కోసం..ఫ్రెండ్ను చంపేశాడు](https://static.v6velugu.com/uploads/2025/02/maharashtra-horror-brothers-kill-friend-over-rs-300-t-shirt-dispute-in-nagpur_cadkSJ8sTq.jpg)
ఇటీవల కాలంలో క్రైం రేటు బాగా పెరిగిపోతుంది..హత్యలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. పరువు కోసం హత్యలు, భార్యను అనుమానంతో భర్త చంపడం, ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయడం,ఆస్థితగాదాలు ఇలాంటి హత్యలు ఒక రకం అయితే.. సిల్లీ కారణాలతో తాగిన మైకంలో చంపడం, స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలే పెద్దగా మారి హత్యలు చేయడం వంటి నేరాలు బాగా పెరిగాయి. మహారాష్ట్రలో ఇద్దరు స్నేహితుల మధ్య టీషర్ట్ విషయంలో చిన్న గొడవ హత్యకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పెరుగుతున్న టెక్నాలజీ, మారుతున్న సామాజిక పరిస్థితులో కానీ ఇటీవల కాలంలో పెరుగుతున్న హత్యలకు కారణాలు, హత్యలు జరిగిన తీరు చూస్తుంటే భయానకంగా షాక్కు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతంలో ఇంతకాలం కలిసి మెలిసి తిరిగిన స్నేహితుడే ఓ టీషర్ట్ కోసం తోటి సహచరుడిని హతమార్చాడు. కేవలం రూ.300ల టీషర్ట్ కోసం ఇద్దరు అన్నదమ్ములు స్నేహితుడికి చంపేశారు.
నిందితుడు అక్షజయ్ అతని సోదరుడు కలిసి శుభమ్ అనే వ్యక్తిని హత్య చేశారు. వీరు ముగ్గురు స్నేహితులు. ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన టీషర్ట్ విషయంలో అక్షజయ్, శుభమ్ మధ్య తలెత్తిన గొడవ..చివరికి శుభమ్ ప్రాణాలు తీసింది.
అక్షజయ్ ఓ టీషర్ట్ ను రూ.300 లకు ఆన్ లైన్ కొనుగోలు చేశాడు. అయితే అది అతనికి సరిపోలేదు.. దీంతో శుభమ్ ను కొనుగోలు చేయాలని చెప్పాడు. అందుకు శుభమ్ తిరస్కరించాడు..దీంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. శుభమ్, అక్షజయ్ మధ్య వివాదంలో అక్షజయ్ సోదరుడు జోక్యం చేసుకోవడం హింసాత్మ కంగా మారింది. హత్యకు దారితీసింది. మద్యం మత్తులో శుభమ్ గొంతుకోసి హత్య చేశారు అన్నదమ్ములిద్దరు.
టీషర్ట్ కొనుగోలు చేయకపోవడంతో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చి అక్షజయ్, అతని సోదరుడు కలిసి శుభమ్ ను హత్య చేసినట్లు నాగ్ పూర్ పోలీసులు నిర్దారిం చారు. హత్య జరిగిన రోజున నిందితులు అక్షజయ్, అతని సోదరుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్షజయ్ సోదరులకు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.. దర్యాప్తు కొనసాగుతోందని నాగ్ ఫూర్ పోలీసులు ప్రకటించారు.