ముంబైలో అన్ని హోర్డింగ్లూ అనుమతి లేనివే: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 

ముంబైలో అన్ని హోర్డింగ్లూ అనుమతి లేనివే: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 

ఇటీవల ముంబైలో హోర్డింగ్  కూలిపోయి 15 మంది ప్రాణాలు కోల్పోవడం, 74 మందికి పైగా గాయాలపాలు కావడం తెలిసిందే. ముంబై మహానగరంలో చాలా చోట్ల హోర్డింగ్ లు అనధికారికంగా ఏర్పాటు చేశారని ఇటీవల ముంబై హౌజింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (MHADA)  చేసిన సర్వేల్లో తేలింది. ముంబై నగరంలో మొత్తం 62 భారీ హోర్డింగ్ లు ఉండగా.. వాటిలో 30 హోర్డింగ్ లకు ఎలాంటి అనుమతి లేకుండానే ఏర్పాటు చేశారని  తేల్చింది. దీంతో MHADA హో ర్డింగ్ ఏర్పాటు చేసిన వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. 

మే 13న  ముంబైలోని ఘట్కోపర్ లో ఈదురుగాలులు, వర్షానికి భారీ ఐరన్ హోర్డంగ్ కూలిపోయి 15 మంది ప్రాణాలు తీసిన ఘటన తర్వాత MHADA,  బృహన్ ముం బై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)  లు ముంబైలోని హోర్డింగ్ లపై దృష్టి పెట్టాయి.అక్రమ హోర్డింగ్ ల సమస్యను పరిస్కరించేందుకు చర్యలు చేపట్టాయి. ఘట్కో పర్ ఘటన తర్వాతసీఎం ఏక్ నాథ్ షిండే  ముంబై అంతటా అక్రమ హోర్డింగ్ లను తొలగించాలని చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం (జూన్ 14 )  జుహు విలే పార్లే లోర్లే ని భువ్ జీవన్ కో ఆపరేటింగ్ హౌజింగ్ సొసైటీ లో అనధికార హోర్డింగ్ ను అధికారులు తొలగించారు.