Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • జార్ఖండ్లో 28 స్థానాల్లో ఎన్డీయే, 3 స్థానాల్లో ఇతరుల ముందంజ
  • మ్యాజిక్ ఫిగర్ 41 దాటేసి జార్ఖండ్లో 50 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం
  • జార్ఖండ్లో ఇండియా కూటమి హవా
  • మహారాష్ట్రలో బీజేపీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడ్
  • 217 స్థానాల్లో ఎన్డీయే లీడ్
  • 58 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి ఆధిక్యం 
  • మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీయే కూటమి
  • 51 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యం
  • 28 స్థానాల్లో లీడ్లో ఉన్న ఎన్డీఏ కూటమి 
  • రెండు స్థానాల్లో ఇతరులు ముందంజ
  • జార్ఖండ్‌లో ఆధిక్యం కనబరుస్తున్న కాంగ్రెస్ కూటమి
  • 89,191 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక
  • రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరీ
  • మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్
  • వయనాడ్ ఉప ఎన్నిక ఫలితం: లక్ష మెజారిటీ దిశగా దూసుకెళుతున్న ప్రియాంక గాంధీ
  • మహాయుతి 185.. మహావికాస్​ అఘాడీ 87  స్థానాల్లో ఆధిక్యం  ( 10 గంటలకు) 
  • మహారాష్ట్రలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన ఎన్డీఏ కూటమి.. 160 స్థానాలకు పైగా ఆధిక్యం ( (ఉదయం 9.50 గంటలకు)
  • మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కొపిరి -పచ్చపఖాడి నియోజకవర్గంలో శివసేన అభ్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • నాగ్​పూర్​ సౌత్​ వెస్ట్​ లో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్​ లీడ్​
  • ఔరంగాబాద్​ లో శివసేనపై ఎంఐఎం ఆధిక్యం
  • వయనాడ్​ లో దూసుకు పోతున్న ప్రియాంక గాంధీ.. 46 వేల ఓట్ల ఆధిక్యం ( ఉదయ 9.30 గంటలకు)
  • జార్ఖండ్లో పోటాపోటీ.. కాంగ్రెస్ 41, బీజేపీ 31, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం
  • మహారాష్ట్ర మాహిమ్లో అమిత్ థాక్రే లీడ్
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యం
  • మహారాష్ట్ర వర్లి స్థానంలో ఆదిత్య థాక్రే లీడ్
  • నాగ్పూర్ సౌత్ వెస్ట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ లీడ్
  • 30 స్థానాల్లో కాంగ్రెస్‌, 29 స్థానాల్లో ఎన్డీఏ, ఒక స్థానంలో ఇతరుల ముందంజ
  • జార్ఖండ్‌లో ఇండియా, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు
  • బర్హత్‌లో హేమంత్‌ సోరెన్‌ ముందంజ
  • మహారాష్ట్రలో కాంగ్రెస్‌ 63, బీజేపీ 80, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యం
  • మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా
  • 3000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
  • వయనాడ్ ఉప ఎన్నిక ఫలితం.. ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
  • మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా
  • స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్న ఎన్డీయే
  • జార్ఖండ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 41
  • మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మొదలైన కౌంటింగ్

దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే సమయం రానే వచ్చింది.  మహా పీఠాన్ని అధిరోహించేది మాహాయుతి సర్కారా? లేదా మహా వికాస్​ అగాఢీ (ఎంవీఏ)నా? అనే ఉత్కంఠ వీడనుంది. శనివారం సాయంత్రంలోగా ఫలితాలు వెలవడనుండగా.. సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్​ నెలకొన్నది. ఎన్నికల ముందునుంచి రెండు కూటములు కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక.. జార్ఖండ్​అసెంబ్లీ ఎన్నికల ఫలితం కూడా నేడే తేలనున్నది. జేఎఎం నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారం దక్కించుకుంటుందా? లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఈసారి కొలువుదీరుతుందా? అనే ఉత్కంఠ వీడనుంది.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి గత బుధవారం సాయంత్రం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువగా 65 శాతం పోలింగ్​ నమోదైంది. జార్ఖండ్లో నవంబర్​13, 20న రెండు దశల్లో పోలింగ్​జరిగింది. మొదటి దశలో 43 నియోజకవర్గాల్లో 81 సీట్లకు, రెండో దశలో 38 సీట్లకు ఓటింగ్​ జరిగింది. ఈసారి జార్ఖండ్ చరిత్రలోనే తొలిసారి అత్యధిక పోలింగ్​ (67.74%) నమోదైంది. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హోరాహోరీగా తలపడ్డాయి.

మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. అనంతరం 9 గంటలనుంచి ఒక్కో ఫలితం వెలువడనున్నది. కాగా, అన్ని కౌంటింగ్​ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించామని ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్లను నిష్పక్షపాతంగా లెక్కించేందుకు ప్రతి టేబుల్కు ఏఆర్ఓ నేతృత్వం వహిస్తారని చెప్పారు. కౌంటింగ్లో పారదర్శకత పాటిస్తున్నామని, నిఘా మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.