ఆన్ లైన్ గ్యాంబ్లింగ్.. రూ.5 కోట్లు గెలిచి..రూ. 58 కోట్లు పోగొట్టుకుండు

ఆన్ లైన్  బెట్టింగ్ యాప్ లలో  ఓ వ్యాపారిని నిండా ముంచారు సైబర్ నేరగాళ్లు.. బెట్టింగ్ యాప్ లలో ఇన్వెస్ట్ పేరుతో  బురిడీ కొట్టించి ఏకంగా రూ.58 కోట్లు దోచేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గోండియాలో జరిగింది. 

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లలో  ఓ వ్యాపారికి ఇటీవల అనంత్ అలియాస్ నవరతన్ జైన్ అనే ఇంటర్నేషనల్ క్రికెట్ బుకీ పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ గేమింగ్ లలో ఇన్వెస్ట్ చేయాలని బలవంతం చేశాడు. మొదట్లో ఇంట్రెస్ట్ చూపని ఆ వ్యాపారి తర్వాత జైన్ చెప్పిన దానికి ఒకే అనేశాడు.  వ్యాపారికి  జైన్  వాట్సాప్ లలో లింకుల్ పెట్టి గ్యాంబ్లింగ్ నడిపించాడు. ఫస్ట్ 8 లక్షలు పెట్టాడు తర్వాత కోటి రూపాయలు వచ్చాయి. ఇలా మొత్తం 5 కోట్లు సంపాదించాడు. ఇలా అంతటితో ఆగని ఆ వ్యాపారి ఆడుతూనే ఉన్నాడు. తర్వాత పోవడమే తప్ప డబ్బులు రావడం లేదు ఇలా ఏకంగా రూ. 58 కోట్లు పోగొట్టుకున్నడు. తాను మోసపోతున్న విషయం ఆలస్యంగా గ్రహించిన వ్యాపారి  పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

వ్యాపారి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు..   నాగ్ పూర్  కు 160  కి.మీ దూరంలోని గోండియా సిటీలో కాకా చౌక్ లో  ఉండే  జైన్  ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో  నాలుగు కిలోల బంగారు బిస్కెట్లతో పాటు రూ.14 కోట్ల నగదు, 200 కిలోల వెండిని  స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే జైన్  దుబాయ్ పారిపోయినట్లు చెప్పారు పోలీసులు.