ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం మరువకముందే మహారాష్ర్టలో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్లో అందరూ సేఫ్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. మథేరన్ హిల్స్టేషన్ నుంచి నేరల్కు టాయ్ ట్రైన్ బయల్దేరింది. ముంబైకి 95 కి.మీ.ల దూరంలో ఉన్న జుమ్మా పట్టి స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. డ్రైవర్ అప్రమత్తం అయి వేగాన్ని అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.
95 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో ట్రైన్లో 95 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు చెప్పారు. వారు వేరే మార్గాల్లో గమ్మస్థానాలకు చేరారని వెల్లడించారు. రైల్వే సిబ్బంది సమస్య పరిష్కరించడంతో శనివారం అర్ధరాత్రి ట్రైన్ నేరల్ స్టేషన్ కు చేరుకుంది. నేరల్ నుంచి మాథేరన్కు వెళ్లే చివరి రైలు రద్దు అయినట్లు రైల్వే ఆఫీసర్లు చెప్పారు.