ఎలక్షన్ కమిషన్ ఆదేశం..17వందల సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్

ఎలక్షన్ కమిషన్ ఆదేశం..17వందల సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్

మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.ఈ క్రమంలో ఎన్నికల సంఘం తప్పుడు సమాచారం, అక్రమం మద్యం, నగదు, వస్తువుల పంపిణీ వంటి కోడ్ ఉల్లంఘటనలపై దృష్టి సారించింది.ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలనుంచి తప్పుడు కంటెంట్ ను తొలగించాలని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ తో సహా ఇతర ప్లాట్ ఫాం లను కోరింది. 

మొత్తం 1752 ఖాతాల్లో తప్పుడు కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించింది.. వెంటనే వాటిని తొలగించాలని కోరింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో శుక్రవారం ( అక్టోబర్ 18) 300 లకు పైగా పోస్ట్ లను తొలగించాయి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు. సమాచార సాంకేతిక చట్టం కింద 79(3) సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చింది.

ALSO READ | అక్టోబర్ 22 నుంచి రెండ్రోజులు..మోదీ రష్యా టూర్

ఫేస్ బుక్ లో 143, ఇన్ స్టా గ్రామ్ లో 280, Xలో 1296, యూట్యూబ్ లో 31 చొప్పున ఖాతాల్లో తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించింది ఎలక్షన్ కమిషన్. 

ఎలక్షన్ కమిషన్ రూల్ అతిక్రమించినట్లు ఇప్పటివరకు సి విజిల్ యాప్ ద్వారా 420 ఫిర్యాదులు కమిషన్ కు అందాయి. వీటిలో 414 ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపింది. ఎక్కువగా థానేలో ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. 

మరోవైపు ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించి మద్యం,నగదు, డ్రగ్స్ ను భారీ ఎత్తున సీజ్ చేశారు. కోడ్ అమలులోకి వచ్చి తర్వాత ఇప్పటివరకు 10.64 కోట్ల విలువైన మేటీరియల్,నగదు, డ్రగ్స్, మద్యం పట్టుబడినట్టు ఈసీ వెల్లడించింది.